logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

సీఎం కేసీఆర్ తో విబేధాలు?.. గవర్నర్ తమిళ సై కీలకవ్యాఖ్యలు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో గవర్నర్ తమిళ సై కి విబేధాలు ఉన్నాయన్న వార్తలు కొంత కాలంగా గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వార్తలపై గవర్నర్ తమిళ సై స్వయంగా వివరణ ఇచ్చారు. ‘మూవింగ్ ఫార్వార్డ్ విత్ మెమొరీస్ ఆఫ్ మెయిడెన్ ఇయర్’ అనే పుస్తకాన్ని తమిళసై విష్కరించారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తన సంవత్సరకాలం అనుభవాన్ని ఆమె ఇందులో పొందుపరిచారు. కాగా తెలంగాణ యూనివర్సిటీలో వీసీలు లేకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నెల రోజుల్లో వీసీలను నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేసారు.

రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి అధికంగా ప్రబలుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని తెలిపిందన్నారు. తాను విశ్రాంతి తీసుకోవడానికి గవర్నర్ పదవిని చేపట్టలేదన్నారు. గవర్నర్, ప్రభుత్వ ఆఫీసులు పని చేయాల్సింది ప్రజల సంక్షేమం కోసమేనన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి నాకు మధ్య మనస్పర్థలు వుంటాయని అనుకున్నారు.

మంచి కమ్యూనికేషన్ ఉన్న కాంట్రావర్సీలకు అవకాశమే లేదన్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ కు తనకు మధ్య అనుబంధంపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కు మధ్య సంబంధం నాట్ ఫైటింగ్, నాట్ ఫెవరేటింగ్ అన్నారు. పక్క రాష్ట్రాల పరిస్థితులపై కామెంట్ చేయబోనన్నారు. ఒక రాష్ట్ర గవర్నర్ గా ఉంటూ రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా తమిళసై పేర్కొన్నారు.

Related News