logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

25 పాఠశాలలు, రూ. కోటి సంపాదన.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి నిర్వాకం

ప్రాథమిక విద్యాశాఖ డిజిటల్ బేస్ వివరాలు సేకరిస్తున్న సిబ్బంది ఖంగుతిన్నారు. ఒకే ఉపాధ్యాయురాలు 25 పాఠశాలల్లో పని చేస్తుండటం, వేతనంగా రూ. కోటి తీసుకున్నట్టుగా తెలియడంతో ఈ వార్త మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో పని చేస్తున్న అనామిక శుక్లా అనే సైన్స్ టీచర్ అమేథీ, అంబెడ్కర్ నగర్, రాయ్ బరేలి ఇలా మొత్తం 25 పాఠశాలల్లో ఒకేసారి బోధిస్తున్నట్టుగా డేటా బేస్ లో చూపింది.

13 నెలలకు గాను కోటి రూపాయల వేతనం తీసుకున్నట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సతీష్ ద్వివేది విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అనామిక శుక్లా పరారీలో ఉన్నట్టుగా సమాచారం. ఒకవేళ ఈ విషయం రుజువైతే ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు ఉంటాయని అయన తెలిపారు. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

అనామిక మణిపూర్ కు చెందిన మహిళగా గుర్తించామన్నారు. ఈ పాఠశాలలో ఆమె కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. అయితే కస్తూర్భా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు నెలకు రూ. 30 వేళా వేతనాన్ని చెల్లిస్తున్నట్టుగా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News