logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

మందుబాబుల‌కు గుడ్ న్యూస్ చెప్ప‌నున్న ప్ర‌భుత్వం..?

ఆంధ్ర‌ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల్లో మ‌ద్య‌‌పాన నిషేదం కూడా ప్ర‌ధాన‌మైన‌ది. ద‌శ‌ల‌వారీగా రాష్ట్రంలో మద్య నిషేదం చేసి కేవ‌లం స్టార్ హోట‌ళ్ల‌కే మ‌ద్యాన్ని ప‌రిమితం చేస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు. మ‌ద్యం ధ‌ర‌లు షాక్ కొట్టేలా పెంచుతామ‌ని చెప్పారు. అన్న‌ట్లుగానే ఏడాది కాలంగా మ‌ద్యంపై ధ‌ర‌ల‌ను రెట్టింపు చేశారు. దీంతో మ‌ద్యం ప్రియుల్లో జ‌గ‌న్ ప్రభుత్వంపై అస‌హ‌నం ఏర్ప‌డింది.

రోజంతా ప‌ని చేసుకొని సాయంత్రానికి మందు తాగ‌డం చాలా మంది కార్మికులు, చిన్న ఉద్యోగుల‌కు ఉండే అల‌వాటు. వీరు రోజంతా ప‌ని చేస్తే రూ.300 నుంచి రూ.500 వ‌ర‌కు వ‌స్తాయి. ఈ డ‌బ్బుల్లో మ‌ద్యానికే స‌గం పోతున్నాయి. దీంతో వీరిలో చాలామంది ప్ర‌భుత్వంపై మ‌ద్యం ధ‌ర‌ల విష‌యంలో అసంతృప్తిగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మారింది. మ‌ద్యం ధ‌ర‌లు పెర‌గ‌డంతో కొంద‌రు శానిటైజ‌ర్‌ను తాగుతున్నారు.

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో శానిటైజ‌ర్ తాగి సుమారు 15 మంది వ‌ర‌కు మ‌ర‌ణించారు. అనేక మంది ఆసుప‌త్రుల పాల‌య్యారు. దీంతో ఇప్పుడు ప్ర‌భుత్వం మ‌ద్యం ధ‌ర‌ల విష‌యంలో పున‌రాలోచ‌న‌లో ప‌డింద‌ని తెలుస్తోంది. మ‌ద్యం ధ‌ర‌లను త‌గ్గించే ఆలోచ‌న ప్ర‌భుత్వం చేస్తోంది. ప్రీమియం మ‌ద్యం బ్రాండ్ల ధ‌ర‌ల‌ను అలానే ఉంచి మిగ‌తా వాటి ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని ప్ర‌భుత్వం చూస్తోంద‌ని, త్వ‌ర‌లోనే ఒక నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Related News