logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఇంట్లోనే చేస్కోండి.. బోనాలపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!

ప్రతి ఏటా తెలంగాణాలో నిర్వహించే ఆషాడ బోనాలకు ఎంతో పేరుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ రాష్ట్రంలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సరం బోనాలు నిర్వహించాలా? వద్దా? అని సందిగ్ధంలో పడింది ప్రభత్వం. ఇటీవల ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ ను సైతం ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని సామూహిక ప్రార్థనలు వద్దని సూచించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా బోనాల పండగ పై కూడా కరోనా ప్రభావం పడింది.

ఈ నెల 25వ తేది నుండి ప్రారంభం కానున్న తెలంగాణ బోనాలను భక్తులు ఇంటివద్దనే బోనం సమర్పించుకోవాలి అని, ఆలయాలకు రావద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఆనవాయితీగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే బోనం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. కరోనా కారణంగా ఈ ఏడాది బోనాలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

ఆయా ఆలయాల్లో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని, ఘటాలు కూడా ఆలయంలోనే ఉరేగిస్తారన్నారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు. గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, పాతబస్తీ బోనాలు ఆకర్షణీయంగా నిలుస్తాయన్నారు. ఈసారి ప్రభుత్వం ఒక రోజు ముందే దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనుందన్నారు.

Related News