logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

బిగ్ బ్రేకింగ్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇక నుంచి మూడు రాజ‌ధానులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మూడు రాజ‌ధానుల ఏర్పాటు ఖాయ‌మైంది. శా‌స‌న రాజధానిగా అమ‌రావ‌తి, న్యాయ రాజ‌ధానిగా క‌ర్నూలు, ప‌రిపాల‌నా రాజ‌ధానిగా విశాఖప‌ట్నం ఉండ‌నున్నాయి. మూడు వారాల క్రితం ఈ రెండు బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదానికి అసెంబ్లీ పంపించింది. ఈ బిల్లుల‌పై న్యాయ నిపుణుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత ఆమోద‌ముద్ర వేస్తూ గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు.

వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక రాజ‌ధాని ఏర్పాటుపై దృష్టి సారించారు. అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మించ‌డానికి ల‌క్ష కోట్లు ఖ‌ర్చు అవుతాయ‌ని అంచ‌నా వేసిన ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రాష్ట్రంలో మొద‌టి స్థానంలో ఉన్న విశాఖ న‌గ‌రంలో ప‌రిపాల‌న రాజ‌ధాని పెడితే మేల‌ని భావించింది. త‌ద్వారా వెనుక‌బ‌డిన ఉత్త‌రాంధ్ర‌కు కూడా న్యాయం చేసిన‌ట్లు అవుతుంద‌ని, హైకోర్టు క‌ర్నూలులో పెట్ట‌డం ద్వారా ఆ ప్రాంతంలో ఎప్ప‌టినుంచో ఉన్న డిమాండ్‌ను నెర‌వేర్చిన‌ట్లు అవుతుంద‌ని ప్ర‌భుత్వం ఆలోచించింది.

ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం వేసిన జీఎన్ రావు క‌మిటీ, బోస్ట‌న్ క‌న్స‌ల్టెన్సీ గ్రూప్ కూడా ఇంచుమించు ఇవే సూచ‌న‌లు చేయ‌డంతో జ‌న‌వ‌రి 20న మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను ప్ర‌భుత్వం అసెంబ్లీలో పెట్టి ఆమోదింప‌జేసింది. త‌ర్వాత శాస‌న‌మండ‌లికి ఈ బిల్లు వెళ్ల‌గా చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే మండ‌లి వాయిదా ప‌డింది. బిల్లులు సెలెక్ట్ క‌మిటీకి పంపిస్తున్న‌ట్లు మండ‌లి ఛైర్మ‌న్ చెప్పినా సెలెక్ట్ క‌మిటీ ఏర్పాటు కాలేదు.

దీంతో మ‌రోసారి ప్ర‌భుత్వం ఈ బిల్లుల‌ను అసెంబ్లీలో పెట్టి ఆమోదింప‌జేసి మ‌ళ్లీ మండ‌లికి పంపించింది. రెండోసారి కూడా మండ‌లిలో ఈ బిల్లుపై చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. దీంతో 30 రోజుల త‌ర్వాత ఆటోమెటిక్‌గా బిల్లుకు మండ‌లి ఆమ‌దం పొందిన‌ట్లు నిబంధ‌న‌లు చెబుతున్నాయి. దీంతో చివ‌ర‌గా గ‌వ‌ర్న‌ర్ ఆమోదానికి పంపించింది ప్ర‌భుత్వం. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ కూడా ఆమోద‌ముద్ర వేయ‌డంతో బిల్లు చ‌ట్ట‌రూపం దాల్చింది. మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ అయ్యింది. కాగా, హైకోర్టులో మాత్రం ఈ వ్య‌వ‌హారం ఇంకా పెండింగ్‌లో ఉంది.

Related News