logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

ఎమ్మెల్సీగా గోరెటి వెంకన్న.. మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఖరారు?

దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూడు స్థానాలు అధికార టీఆర్ఎస్ పార్టీకే దక్కే అవకాశాలు ఉన్నాయి. కాగా ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతుంది. శుక్రవారం నాడు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న కేబినెట్‌లో చర్చించిన అనంతరం జాబితాపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులను బీసీ, ఎస్సి, ఎస్టీ, ఓసీ సామజిక వర్గాల నుంచి ఎంపిక చేసే అవకాశముంది.

ఈ రేసులో ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి వెంకన్న వెన్నుదన్నుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోరటి వెంకన్న పేరు ఎమ్మెల్సీ కోటా అభ్యర్థుల రేసులో ముందువరసలో ఉంది. మరో రెండుస్థానాలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆయనతో పాటుగా దేశపతి శ్రీనివాస్, మాజీమంత్రి బస్వరాజు సారయ్య పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ మాజీ ఎంపీ బస్వరాజు సారయ్య పార్టలో చేరారు. కాగా ఆయనకు ఏ పదవి ఇస్తారనే విషయం పై ఎప్పటినుంచో చర్చ నడుస్తుంది. కాగా శుక్రవారం నాడు దీనిపై స్పష్టత రానున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ నేతలు వెల్లడించారు.

Related News