logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

యూట్యూబ్ చానెళ్లకు గూగుల్ షాక్..!

యూట్యూబ్ చానెళ్లకు గూగుల్ బ్యాడ్ న్యూస్ వినిపించింది. గూగుల్ తెచ్చిన కొత్త విధానంతో యూట్యూబర్ల ఆదాయం తగ్గిపోనుంది. సాధారణంగా యూట్యూబ్ చానెళ్లకు ప్రపంచ వ్యాప్తంగా వ్యూయర్స్ ఉంటారు. అందువల్ల వివిధ మార్గాల ద్వారా యూట్యూబర్లకు ఆదాయం వస్తుంది. మన దేశం నుంచే కాకుండా అమెరికాలో ఉన్న వ్యూయర్స్ నుంచి కూడా వీరికి డబ్బులు వస్తుంటాయి. మరో విధంగా యూట్యూబ్ వీడియోల్లో గూగుల్ ఆడ్స్ ను ఇస్తుంది. వీటిని వ్యూయర్స్ స్కిప్ చేయకుండా చూస్తే కూడా వాటి ద్వారా చానెళ్లకు ఆదాయం వస్తుంది. చానెళ్లకు ఉన్న సబ్ స్క్రైబర్స్ ను బట్టి కూడా యూట్యూబ్ ప్రీమియం ద్వారా డబులు ఇస్తుంది.

ఇవే కాకుండా సూపర్ చాట్లు, స్టిక్కర్లు, ఛానెల్ మెంబర్ షిప్లు ఇలా చాలానే ఉంటాయి. ఇలా యూట్యూబ్ ద్వారా డబ్బులు తీసుకునే వారు వారి వారి దేశాల్లో పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. కానీ తాజాగా గూగుల్ తీసుకున్న నిర్ణయం యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులకు షాకిచ్చింది. అమెరికన్ వ్యూయర్స్ నుంచి వచ్చే ఆదాయం నుంచి అమెరికాకు ట్యాక్స్ కట్టాలని గూగుల్ కొత్త నిబంధన విధించింది. దీంతో ఛానెల్ యూజర్లకు ఈ వార్త షాకిస్తుంది. అయితే ఈ ట్యాక్స్ లో కూడా రెండు రకాలుగా ఉంది. మన దేశానికి అమెరికాతో పన్నుల ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. ఇలా ఇది వరకే టాక్స్ ఒప్పందాలు ఉన్న దేశాలలోని యూట్యూబర్ల దగ్గర నుంచి 15 శాతాన్ని వసూలు చేస్తుంది.

ఉదాహరణకు ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఆదాయం 1000 రూపాయలు ఉంటె అందులో 100 రూపాయలు అమెరికన్ వీక్షకుల ద్వారా అందుతుంది అనుకోండి. ఆ 100 రూపాయలలో 15 శాతాన్ని పన్ను కింద అమెరికాకు చెల్లించవలసి ఉంటుంది. పన్ను ఒప్పందాలు లేని దేశాల దగ్గరి నుంచి వారి ఆదాయం నుంచి 30 శాతాన్ని వసూలు చేస్తుంది. ఈ కొత్త విధానంపై గూగుల్ డెడ్ లైన్ కూడా విధించింది. మే 31 లోగా యూట్యూబర్లు గూగుల్ కు తమ ఆదాయ వివరాలను అందించవలసి ఉంటుంది.

అందుకోసం గూగుల్ యాడ్ సెన్స్ నుంచి వారికి ఒక మెయిల్ ను పంపుతుంది. ఇండివిడ్యువల్ యూట్యూబర్లైతే డబ్ల్యు-8 బీఈఎన్ ఫామ్ ను నింపాలి. అదే కంపెనీలకు సంబందించిన ఛానెళ్లయితే డబ్ల్యు-8 బీఎన్ఈ ఫామ్ ను నింపవలసి ఉంటుంది. ఒక వేళ గడువు లోగా ఈ వివరాలను యూట్యూబ్ చానెళ్లు సమర్పించకపోతే వారు మొత్తం ఆదాయంలో 24 శాతాన్ని టాక్స్ కట్టవలసి ఉంటుందని గూగుల్ తెలిపింది.

Related News