logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు శుభవార్త..!

వినియోగదారులకు గూగుల్ పే, ఫోన్ పే సంస్థలు శుభవార్త వినిపించాయి. యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. అందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో కలిసి ఈ కంపెనీలు పని చేస్తున్నాయి. దీని ద్వారా యూజర్లకు మరిన్ని స్మార్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అంటే కరెంటు బిల్లు, మొబైల్ ఫోన్ బిల్లు, ఈఎంఐలు, మీడియా సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలా ఎన్నో రకాల చెల్లింపులు ఆటోమేటిక్‌గా పూర్తవుతాయి.

ఒక్కసారి ఆటో డెబిట్ ఫీచర్ ను ఆక్టివేట్ చేసుకుంటే ఇక నెలవారీ బిల్లుల గురించి ఆలోచించే పని ఉండదు. ఏ బిల్లు ఏ తేదీన చెల్లించాలో అదే చూసుకుంటుంది. ఈ రికరింగ్ పేమెంట్ మ్యాండేట్స్ అంశం ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఈ ఫీచర్ యూజర్లకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. కాగా మరో నెలలో ఈ ఫీచర్ ను ఈ సంస్థలు అందుబాటులోకి తేనున్నాయని సమాచారం.

Related News