logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. !

రాష్ట్రంలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారందరిని పాస్ చేసింది ప్రభుత్వం. అందువల్ల ఇక విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించబోమని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించారు కాబట్టి ఫలితాల ప్రకటన కూడా అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు.

తాజాగా విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. విద్యార్థుల మార్కుల మెమోను నేరుగా విద్యార్థుల ఇంటి వద్దకే పంపే విధంగా ప్రభత్వ పరీక్షల విభాగం ప్రణాలికను తయారుచేస్తుంది. ఇప్పుడు విద్యార్థులకు వారి ఇంటర్నెల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే మిగిలింది. కాగా ఒక్కో విద్యార్థి ఇంటర్నల్ మార్కుల్లో 20 మార్కులకు ఎన్ని వచ్చాయో వాటిని 5 రెట్లు చేసి గ్రేడ్ లు ఇవ్వనుంది.

పరీక్షకు దరఖాస్తు చేసిన వారిలో ప్రయివేటు పాఠశాలకు చెందిన విద్యార్థులే 3.75 మంది ఉన్నారు. కాగా ఈ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఇంటర్నల్ లో విద్యార్థులకు 20 కి 20 మార్కులు వేసినట్టు ప్రాథమికంగా ఉన్న సమాచారం. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షన్నర మంది విద్యార్థులకు 10/10 జీపీఏ పాయింట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Related News