మీర్జాపూర్ వెబ్ సిరీస్ అభిమానులకు శుభవార్త వినిపించింది చిత్ర యూనిట్. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమయ్యే ఈ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. అడల్ట్ కంటెంట్, బూతులు, హింస కంటెంట్ తో గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ పై యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. మొదటి సిరీస్ లో పంక్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి, హర్షితా శేఖర్, అమిత్ సియాల్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించగా కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్‌లు దీనిని తెరకెక్కించారు.
ఈ సిరీస్ హిట్టవ్వడంతో దీనికి కొనసాగింపుగా మీర్జాపూర్- 2 ని కూడా ప్రారంభించారు. అయితే అది కేవలం హిందీ బాషలోనే అందుబాటులో ఉండటంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆందోళన బాట పట్టారు. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సిరీస్ ను అందించాలని డిమాండ్ చేసారు. దీంతో ఈ చిత్ర యూనిట్ తెలుగు ప్రేక్షకులకు శుభవార్త వినిపించింది.
డిసెంబర్ 11 నుంచి దీనికి తెలుగు ఆడియోను కూడా జోడించి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా మీర్జాపూర్ -2 విషయానికొస్తే ఈ సిరీస్ మొదటి పార్ట్ తో పోలిస్తే రెండవ భాగంలో హింస ఎక్కువగా ఉండటం ప్రేక్షకులను కాస్త నిరాశపరుస్తుందని అంటున్నారు.