ఎల్పీజీ వినియోగదాయులకు దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ యాప్ ఉపయోగించి సిలిండర్ ను బుక్ చేసేవారికి సిలిండర్ బుకింగ్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటుగా ఒక సిలిండర్ ను ఉచితంగా అందించనున్నారు. అమెజాన్ తో పాటుగా ప్రముఖ ఈ వ్యాలెట్ సంస్థ పే టిఎం లో కూడా ఈ క్యాష్ బ్యాక్ అఫర్ అందుబాటులో ఉంది.
అయితే అమెజాన్ ద్వారా ఆఫర్లను పొందాలనుకునే వారు యాప్ లోకి వెళ్లి ‘పే బిల్స్’ అనే అప్షన్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ గ్యాస్ ఆపరేటర్ ను ఎంచుకోవాలి. ఎల్ పీజీ ఐడీ లేదా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి అమెజాన్ ద్వారా బిల్లును చెల్లించాలి. దీని ద్వారా బుకింగ్ పై 50 శాతం రాయితీని అందిస్తుంది. ఈ అఫర్ మొదటిసారి సిలిండర్ ను బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది.
పే టీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకునే వారికి కూడా రూ. 500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. సాధారణంగా 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 700 గా ఉంది. దీనికి తోడు ప్రభుత్వం దీనిపై రూ. 200 సబ్సీడీ ఇస్తుంది. ఒక వేళ రూ. 500 క్యాష్ బ్యాక్ వస్తే ఒక సిలిండర్ ను ఉచితంగా పొందినట్టే. అయితే ఇక్కడ ఫస్ట్ ఎల్ పీజీ అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించవలసి ఉంటుం