గత ఎనిమిది నెలలుగా బంగారం ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వల్పంగా ధరలు పెరిగినా తాజాగా మరోసారి బంగారం ధరలు భారీగా పడిపోయాయి. భవిష్యత్తులో కూడా మరింత తగ్గే అవకాశం ఉన్నట్టుగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ కాకపోవడం, మరోవైపు కరోనా పెరిగిపోతుండటంతో బంగారం ధరలు పడిపోతున్నట్టుగా తెలుస్తుంది. మార్చి 30 వ తేదీన అంటే మంగళవారం రోజున తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 350 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 41,350 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర రూ. 4135 గా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధరపై రూ. 380 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,110 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4’511 గా ఉంది.
తగ్గిన బంగారం ధరలు హైదరాబాద్ తో పాటుగా విజయవాడ విశాఖలోని ఇదే విధంగా ఉన్నాయి. బంగారం ధరలు దిగొస్తే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధరపై రూ. 200 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 69,500 గా ఉంది. తులం వెండి ధర రూ. 695 గా ఉంది. బంగారం, వెండి ధరలు వివిధ అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారుల మరొక్కసారి ధరలను సరిచేసుకోవడం మంచిది.