logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

పసిడి ప్రియులకు భారీ ఊరట: 17.03. 2021 బంగారం, వెండి ధరలు

కొంతకాలంగా దిగొస్తున్న బంగారం ధరలు మంగళవారం రోజున మార్పు లేకుండా ఉన్నాయి. దీంతో బుధవారం నాటి ధరలు కూడా స్థిరంగా కొనసాగాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల వివరాలను తెలుసుకుందాం..

మార్చి 17 వ తేదీన హైద్రాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 42,010 రూపాయలుగా ఉంది. ఒక గ్రాము బంగారం ధర రూ. 4,201 గా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 45 వేల రూపాయల మార్క్ దగ్గర నిలిచింది. దాంతో 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర వద్దే కొనసాగుతుంది. మొత్తానికి 10 గ్రాముల బంగారం ధర 45,830 గా ఉండగా ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,583 గా ఉంది. హైదరాబాద్ తో పాటుగా విశాఖ, విజయవాడ లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

బంగారం ధరలు స్థిరంగా ఉంటె.. వెండి ధరల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల కనిపించింది. కేజీ వెండి ధర పై నిన్నటితో పోలిస్తే 10 రూపాయలు పెరిగింది. దీంతో 71 వేల రూపాయల స్థాయిలోనే వెండి ధరలు ఉన్నాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 71,600 గా ఉంది. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు బంగారం కొనేముందు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.

 

Related News