గడిచిన 18 రోజులుగా బంగారం ధరలు ధరల్లో పెరుగుదల నమోదవుతుంది. దీంతో బంగారం కొనాలనుకునే వారంతా మళ్ళీ ధరలు ఎక్కడ పెరుగుతాయో అని భావించి కొనుగోళ్ళకు ఆసక్తి చూపుతున్నారు. ఇన్వెస్టర్లు కూడా కరోనా కారణంగా బంగారం పైనే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ 21 అంటే బుధవారం రోజునాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం హైద్రాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,850 గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు భారీగా రూ. 700 పెరిగింది. ఒక గ్రాము బంగారం ధర రూ. 4,485 కు లభిస్తుంది. అదే విధంగా పెట్టుబడులకు అనువైన 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 770 పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 48,930 కు లభిస్తుంది. ఒక్క గ్రాము బంగారం కొనాలంటే రూ. 4,893 గా ఉంది.
అలాగే వెండి విధయానికొస్తే.. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం వెండి ధరపై రూ. 300 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 73.900 కు చేరుకుంది. తులం వెండి రూ. 739 కు లభిస్తుంది. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు వివిధ అంతర్జాతీయ, భౌగోళిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొనేముందు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.