గత ఐదు రోజులుగా క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఇవాళ గురువారం అంటే ఫిబ్రవరి 26న బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ముందుగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు నిన్న రూ.43,750 ఉండగా ఇవాళ రూ.350 తగ్గడంతో రూ.43,400కు క్షీణించింది. అంటే, 22 క్యారెట్ల బంగారం ఒక్క గ్రాము ధర రూ.4,340గా ఉంది. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడలో కూడా ఇదే ధర ఉంది. 22 క్యారెట్ల బంగారాన్ని నగల తయారీకి ఉపయోగిస్తారు.
24 క్యారెట్ల బంగారం ధర కూడా కొంతమేర తగ్గింది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.47,730 ఉండగా ఇవాళ రూ.380 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,350గా ఉంది. అంటే, హైదరాబాద్ మార్కెట్లో ఒక్క గ్రాము ధర రూ.4,735కు లభిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో కూడా ఇదే ధర ఉంది.
ఒకవైపు బంగారం ధరలు తగ్గితే వెండి ధర మాత్రం పెరగడం గమనార్హం. నిన్నటి వరకు తగ్గిన వెండి ధర ఇవాళ పెరిగింది. నిన్న కేజీ వెండి ధర రూ.74,400 ఉండగా ఇవాళ ఏకంగా రూ.600 పెరిగింది. దీంతో వెండి ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కేజీ రూ.75,000 ధరకు చేరుకుంది. అంటే ఒక గ్రాము వెండి ధర రూ.750. బంగారం, వెండి కొనేవారు ఎప్పటికప్పుడు ధరలను పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలి. మార్కెట్ ధరలు నిత్యం మారుతూ ఉంటాయి.