బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గుతున్న విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సుమారు 12,000, 24 క్యారెట్ల ధర రూ.13,000 తగ్గింది. గత పది రోజులుగా కూడా క్రమంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఇది బెస్ట్ టైమ్ అని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే ఇవాళ అంటే మార్చ్ 7న ఆదివారం మాత్రం బంగారం రేట్లు పెరిగాయి.
నిన్నటి వరకు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గినా ఇవాళ మాత్రం పెరగడం బంగారం కొనాలనుకునే వారిని ఇబ్బంది పెట్టే విషయం. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగింది. దీంతో ప్రస్తుతం రూ.45,490 పలుకుతోంది. ఇదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.41,700కు పెరిగింది.
నిన్నటి వరకు బంగారం ధరలు క్రమంగా తగ్గిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు భారీగా ధర తగ్గడంతో ఇవాళ స్వల్పంగా బంగారం ధర పెరిగినా కొనుగోలుదారులు కొనవచ్చు. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడలోనూ బంగారం ధరలు ఇవే ఉన్నాయి. బంగారం ధరలు అనేక దేశీయ, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి, ధరలను కొనేముందు మళ్లీ పరిశీలించుకుంటే మంచిది.