నాలుగు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు నిన్నటి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం అంటే ఫిబ్రవరి 22న ప్రారంభమైన ధరలే మంగళవారం ప్రారంభం కూడా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కొనేందుకు ఇది మంచి సమయమే అని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇవాళ అంటే ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో బంగారం ధరలు ఒకసారి చూద్దాం.
ఇవాళ మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,190గా ఉంది. నిన్నటి నుంచి ఈ ధర నిలకడగా ఉంటుంది. నిన్న కూడా కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. ఇక, 22 క్యారెట్ల బంగారం ధరను చూస్తే.. 10 గ్రాములకు ఇవాళ మంగళవారం రూ.43,260గా స్థిరంగా ఉంది. నిన్న కూడా ఇదే ధర పలికింది.
హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. విజయవాడ, విశాఖపట్నంలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,190 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.43,260 పలుకుతోంది. అయితే, బంగారం ధరలు స్థిరంగా ఉన్నా వెండి ధరలు మాత్రం బాగానే పెరుగుతున్నాయి. ఈ రోజు అంటే ఫిబ్రవరి 23న వెండి ధర కిలోకు రూ.600 పెరిగి రూ.74,400కు చేరుకుంది.