గత మూడు రోజులుగా వరుసగా బంగారం ధరలు పతనమవుతున్న సంగతి తెలిసిందే. బంగారం ధరలు తగ్గుతుండటంతో బంగారం కొనాలనుకునే వారు సంతోషపడుతున్న వేళ ఇవాళ అంటే ఫిబ్రవరి 21న బంగారం ధరలు పెరిగాయి. ముందుగా హైదరాబాద్లో బంగారం రేట్లు ఒకసారి చూస్తే.. వరుసగా మూడు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,390 వరకు తగ్గడంతో శనివారం రూ.46,900కు క్షీణించింది.
అయితే, శనివారంతో చూస్తే ఇవాళ అంటే ఆదివారం ఫిబ్రవరి 21న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.280 పెరిగింది. దీంతో హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.47,180గా ఉంది. గత మూడు రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,250 తగ్గడంతో బంగారం ధర శనివారం రూ.43,000కు దిగి వచ్చింది. కానీ, ఆదివారం అంటే ఫిబ్రవరి 21న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 పెరగడంతో రూ.43,250కి పెరిగింది.
బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా కొంతమేర పెరిగాయి. గత మూడు రోజుల్లో కిలో వెండి ధర రూ.1,600 వరకు తగ్గడంతో వెండి రేటు రూ.73,400కు క్షీణించింది. పరిశ్రమ, యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో మూడు రోజుల పాటు వెండి ధర తగ్గినా ఇవాళ పెరిగింది. ఇవాళ వెండి ధర కిలోకు రూ.400 పెరగడంతో రూ.73,800కు చేరుకుంది.