వారం పది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పడిపోవడం కొనుగోలుదారులకు కలిసివచ్చే అంశం. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10 వ తేదీన అంటే శనివారం రోజున బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 100 దిగొచ్చింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 43,400 గా నమోదైంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,340 కు లభిస్తుంది. ఇక పెట్టుబడులకు అనువైన 24 క్యారెట్ల బంగారం ధరపై నిన్నటితో పోలిస్తే రూ. 110 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 47,350 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,735కు లభిస్తుంది. పెరిగిన బంగారం ధరలు హైద్రాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖలోను ఇదే విధంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటె ఈరోజు వెండి ధరలు మాత్రం భారీగా దిగొచ్చాయి. వెండి ధరపై రూ. 500 తగ్గడంతో కేజీ వెండి రూ. 71,600 కు లభిస్తుంది. తులం వెండి ధర రూ. 716 గా ఉంది. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు సాధారణమే. అయితే కొనుగోలుదారులు ధరలను మరొక్కసారి పరిశీలించుకోవడం మంచిది.