logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు 23.04. 2021 బంగారం, వెండి ధరలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కొంత కాలంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. తాజాగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండటం పసిడి ప్రియులకు షాకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు కూడా స్వల్పంగా పెరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్ 23 వ తేదీన అంటే శుక్రవారం రోజున ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

హైద్రాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై నిన్నటితో పోలిస్తే రూ. 10 పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 45,260కు చేరుకుంది. అలాగే ఒక్క గ్రాము బంగారం రూ. 4,526 కు లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారం ధరపై కూడా రూ. 10 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,260కు చేరుకుంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,626కు లభిస్తుంది. హైదరాబాద్ తో పాటుగా విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ఇక వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. వెండి ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండగా ఈరోజు మాత్రం భారీగా తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం కేజీ వెండి ధర పై రూ. 100 తగ్గింది. కేజీ వెండి ధర 69,300గా ఉంది. తులం వెండి రూ. 693గా ఉంది. బంగారం, వెండి ధరలు వివిధ అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది

Related News