బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరగడం, కరోనా కేసులు పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే ఏప్రిల్ 4 వ తేదీన అంటే ఆదివారం రోజున మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజున నగల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 10 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 42,260 గా నమోదైంది. ఒక గ్రాము బంగారం ధర రూ. 4,226 గా ఉంది. అదే విధంగా పెట్టుబడులకు అనువైన 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 10 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,100 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం రూ. 4,610 కు లభిస్తుంది. పెరిగిన ధరలు హైదరాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖలోను ఇదే విధంగా ఉన్నాయి.
వెండి ధరల విషయానికొస్తే నిన్న స్థిరంగా ఉన్న ధరలపై ఈరోజు స్వల్పంగా ఒక్క రూపాయి పెరుగుదల నమోదైంది. కేజీ వెండి ధర రూ. 69,710 గా ఉంది. తులం వెండి రూ. 697.10 పైసలుగా ఉంది. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు ధరలను మరొక్కసారి సరిచూసుకోవడం మంచిది.