logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

స్వల్పంగా పెరిగిన బంగారం: 07.04. 2021 బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత పది రోజులుగా ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం భారీగా దిగొచ్చిన బంగారం ధరల్లో మరోసారి స్వల్పంగా పెరుగుదల నమోదైంది. నిజానికి ఇదసలు పెరుగుదలే కాదు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి బంగారం కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఏప్రిల్ 7వ తేదీన అంటే బుధవారం రోజున బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైద్రాబాద్ మార్కెట్లో ధరలను పరిశీలిస్తే.. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారంపై స్వల్పంగా రూ. 10 పెరిగింది. దీంతో తులం బంగారం రూ.42,410 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4241కు లభిస్తుంది. ఇక పెట్టుబడులు పెట్టేందుకు అనువైన 24 క్యారెట్ల బంగారం ధర పై కూడా రూ. 10 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 46,260 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4626 గా ఉంది.

బంగారం ధరలు ఇలా ఉంటె వెండి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 70,500 గా ఉంది. తులం వెండి రూ. 705 గా ఉంది. బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.

Related News