గత వారం దిగొచ్చిన బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి భారీగా పెరిగాయి. మళ్ళీ రెండు రోజులుగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తున్నా అది చాలా స్వల్పంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఈ నేపథ్యంలో ఈరోజు ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనే ఆసక్తి పసిడి ప్రియుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం అంటే ఏప్రిల్ 5 వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల మేలిమి బంగారం ధర పై స్వల్పంగా రూ. 10 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 42,270 గా నమోదైంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,227గా ఉంది. పెట్టుబడులకు అనువైన 24 క్యారెట్ల బంగారం ధరపై కూడా రూ. 10 పెరగడంతో తులం బంగారం రూ.46,110 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,611 గా ఉంది. హైదరాబాద్ తో పాటుగా ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖలోని ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 69,700 కు లభిస్తుంది. తులం వెండి కొనాలంటే రూ. 697 గా ఉంది. కరోనా కారణంగా రానున్న రోజులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి బంగారం కొనుగోలు చేసేవారికి ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు.