logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు‌ 09.03.2021 బంగారం ధ‌ర‌లు!

బంగారం ధ‌ర‌లు ఇటీవ‌ల భారీగా త‌గ్గుతున్న విష‌యం తెలిసిందే. గ‌త ప‌ది రోజులుగా కూడా క్ర‌మంగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. దీంతో బంగారం కొనేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇవాళ అంటే మార్చి 9 మంగళవారం మాత్రం బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి.

నిన్నటి వ‌ర‌కు బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గినా ఇవాళ మాత్రం స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌లలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారం బంగారం ధరపై రూ.320 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,820 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.290 పెరగడంతో బంగారం ధర రూ.42,000 అయింది.

ఇక వెండి విషయానికి వస్తే.. బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర రూ.800 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.66,500కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.900 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,000గా ఉంది. వెండి, బంగారం ధ‌ర‌లు అనేవి దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబ‌ట్టి, కొనేముందు ధరలను మ‌ళ్లీ ప‌రిశీలించుకుంటే మంచిది.

 

 

Related News