logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

స్థిరంగా బంగారం ధరలు.. 18. 03. 2021 బంగారం, వెండి ధరలు

గడిచిన 10 రోజుల వ్యవధిలో వరుసగా 5 సార్లు పెరిగిన బంగారం ధరలు మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయంగా మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా గురువారం అంటే మార్చి 18 రోజున బంగార ధరలను తెలుసుకుందాం..

ప్రస్తుతం హైద్రాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 42,010 రూపాయలుగా ఉంది. ఒక గ్రాము బంగారం ధర రూ. 4,201 గా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 45 వేల రూపాయల మార్క్ దగ్గర నిలిచింది. దాంతో 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర వద్దే కొనసాగుతుంది. మొత్తానికి 10 గ్రాముల బంగారం ధర 45,830 గా ఉండగా ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,583 గా ఉంది. హైదరాబాద్ తో పాటుగా విశాఖ, విజయవాడ లో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఇక వెండి ధరల్లో కూడా ఈరోజు ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 71,600 గా ఉంది. తులం వెండి ధర రూ.716 గా ఉంది. బంగారం,వెండి ధరల్లో వివిధ అంతర్జాతీయ అంశాలకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి కొనుగోలు దారులు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.

Related News