logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

పెళ్లి పేరుతో యువకుడి వద్ద రూ.16 లక్షలు కాజేసిన యువతి

పెళ్లి కాని యువకుల్ని టార్గెట్ చేస్తూ కిలేడీలు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అందమైన ఫోటోలు పెట్టి మాట్రిమోనీ సైట్ల ద్వారా వల వేస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం అంతా నిజమని నమ్మిన వారు చివరకు లక్షలకు లక్షలు దోపిడీకి గురవుతున్నారు. ఈ మాయ లేడీల దెబ్బకి మోసపోయిన వారు కొందరు సమాజంలో పరువు పోతుందని భావించి మిన్నకుండిపోతున్నారు. మరికొందరు మాత్రం ముందుకొచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

తాజాగా బెంగుళూరుకి చెందిన అంకుర్ శర్మ అనే యువకుడు సాఫ్ట్ వేర్ గా పని చేస్తున్నాడు. ఇటీవల ఓ మాట్రిమోనియల్ సైట్లో పెళ్లి కూతురు కోసం వెతుకుతుండగా కిరారా శర్మ అమ్మాయి పరిచయం అయ్యింది. ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా అంతవరకు ప్రేమించుకుందాం అంటూ ఆ యువతి మభ్యపెట్టింది. రోజూ గంటల తరబడి ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకునే వారు.

ఈ క్రమంలో బాధితుడి వద్ద నుండి వివిధ కారణాలు చెప్పి ఏకంగా రూ. 16.82 లక్షలు కాజేసింది. ఇటీవల ఆ యువతి తనను దూరం పెడుతుందని భావించిన బాధితుడు ఆమెను నిలదీసాడు. దీంతో పెళ్లికి ఒప్పుకోకపోగా ఆ యువతి జాడ లేకుండా పోయింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు వైట్ ఫిల్డ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు కోసం గాలిస్తున్నారు.

Related News