logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

మోగిన ఎన్నికల నగారా.. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు విడుదల!

నగరంలో గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. ఈమేరకు డిసెంబర్ 1వతేదీన జీహెచ్ఎంసీ పోలింగ్ ను ఖరారు చేసారు. ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ ను నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఒక గంట అదనంగా కేటాయించామన్నారు.

డిసెంబర్ 4వ తేదీన ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు. అలాగే నవంబర్ 18 నుంచి 20 వ తేదీల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ ను స్వీకరించనున్నారు. డిసెంబర్ 6 వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని పార్థసారథి ప్రకటించారు. అవసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు.

కాగా ప్రస్తుతం ఈ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పార్థసారథి స్పందిస్తూ. రిజర్వేషన్ల అంశం కోర్టుకు సంబందించినది అని, తాము మాత్రం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా స్పష్టం చేసారు. ఈసారి కూడా బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు.

Related News