నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని, నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని, లావుగా మారతారనే, నెయ్యి త్వరగా అరగదని చాలా ప్రచారాలు ఉన్నాయి. నిజానికి ఇవి అపోహలు మాత్రమే అని వైద్యులు చెబుతున్నారు. నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. నెయ్యిలో మన శరీరానికి మంచి చేసే అనేక గుణాలు ఉన్నాయి.
నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. నిజంగా నెయ్యి తింటే శరీరంలో కొవ్వి కరుగుతుంది. నెయ్యిలో అమైనో అమ్లాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోని రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యి తింటే అరగది కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది కూడా అబద్ధమే.
నెయ్యి తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. వీటి వల్ల మనం తీసుకునే ఆహారం త్వరగా అరుగుతుంది. నెయ్యి వల్ల అనారోగ్యం అనేది కూడా అపోహనే. నిజానికి నెయ్యి మనకు అరోగ్యమే ఇస్తుంది. నెయ్యిలో యాంటీ ఫంగల్, యాంటీవైరస్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఇంట్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ సమయంలో మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం అవసరం. కాబట్టి, నెయ్యి తినడం మంచిదే.
నెయ్యి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నెయ్యి తింటే కళ్లు బాగా పని చేస్తాయి. కీళ్ల నొప్పులు కూడా క్రమంగా తగ్గుతాయి. మానసికంగా కూడా నెయ్యి మంచి చేస్తుంది. నెయ్యి తినడం ద్వారా మనలో ఒత్తిడి తగ్గుతుందని, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని కూడా పలు పరిశోధనల్లో తేలింది. కాబట్టి, నెయ్యి అన్ని విధాలుగా మనకు మంచిదే. కాకపోతే మార్కెట్లో కల్తీ నెయ్యి ఎక్కువగా అందుబాటులో ఉంది. కాబట్టి, అసలైన, నాణ్యమైన నెయ్యి మాత్రమే గుర్తించి తినాలి.