logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

ఘట్కేసర్ విద్యార్థిని అత్యాచార ఘటనలో ఊహించని ట్విస్ట్!

ఘట్కేసర్ బీ ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో విస్తపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. విచారణలో నిందితులు విద్యార్థినికి మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డట్టుగా అంగీకరించారని సమాచారం అందుతుంది. కాగా దీనిపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. రాచకొండ పోలీసులు నిందితుల నేర చరితపై ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఒంటరిగా కాలేజీలకు, ఆఫీసులకు వేలే మహిళలను టార్గెట్ చేసేవారని వెల్లడైంది. నలుగురు కలిసి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసేవారు విషయాన్నీ ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించేవారు. ఈ విధంగా గతంలో ఐదుగురిపై అఘాయిత్యానికి పాల్పడినట్టుగా గుర్తించారు. కాగా విద్యార్థిని కిడ్నాప్ అత్యాచార యత్నానికి ముందుగానే పథకం వేసినట్టుగా తెలిపారు. విద్యార్థిని రోజు కాలేజీ బస్సు దిగి రాంపల్లి చౌరస్తా దగ్గర ఆటో ఎక్కుతుండటం నిందితులు గమనించారు.

యన్నంపేటకు చెందిన ప్రధాన నిందితుడు ఆ అమ్మాయిపై వారం రోజులుగా కన్నేశాడు. ఆమె తిరిగొచ్చే సమయానికి తన ఆటో తీసుకొని స్టేజీ వద్దకు వస్తున్నాడు. చౌరస్తాలో ఉన్న అడ్డాలో నిందితుడు ఆటోను ఉంచడంతో విద్యార్థిని పలుమార్లు ఆ ఆటోలో ప్రయాణించింది. అదను చూసుకుని విద్యార్థిని ఆటోలో ఎక్కించుకున్న నిందితుడు ఆమెను ఆమె దిగాల్సిన స్టాప్ దగ్గర ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. యమనం పేట దగ్గరకు రాగానే మరో ఇద్దరు నిందితులు ఎక్కారు.

విద్యార్థినిని అరవకుండా వారిద్దరూ నోరు నొక్కి పట్టుకున్నారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో రాడ్లతో కొట్టారు.అప్పటికే సిద్ధం చేసిన మారుతి వ్యాన్ లోకి ఎక్కించి అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టుగా సమాచారం. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు టీములుగా ఏర్పడి చుట్టూ పాకాల ప్రాంతాల్లో సైరన్ మోగిస్తూ వెతికారు.

పోలీసుల హడావిడికి భయపడిపోయింది నిందితులు బాధితురాలిని అక్కడే వదిలేసరి పరారయ్యారు. సీసీ కెమెరాలు, తోటి ఆటో డ్రైవర్లను విచారించడం ద్వారా నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు పోలీసులు. పోలీసుల రాక ఏమాత్రం ఆలస్యమైనా మరింత ఘోరం జరిగేదని భావిస్తున్నారు.

Related News
%d bloggers like this: