logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

రూ.79,999/- ఫోన్ కేవ‌లం రూ.29,999/-కే.. క‌నీవినీ ఎరుగ‌ని భారీ ఆఫ‌ర్‌

ఈకామ‌ర్స్ వెబ్‌సైట్‌లు అప్పుడ‌ప్పుడు స్మార్ట్ ఫోన్‌ల‌పై ప‌లు ఆఫ‌ర్స్ ప్ర‌క‌టిస్తుంటాయి. ప్ర‌త్యేక డిస్కౌంట్‌లు ఇచ్చి ఫోన్లు విక్ర‌యిస్తుంటాయి. 2 – 3 వేల డిస్కౌంట్లు ఇస్తేనే మ‌నం మంచి డిస్కౌంట్ దొరుకుతుంది అని సంబ‌ర‌ప‌డి ఫోన్‌లు కొంటాం. అయితే, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఏకంగా ఒక ఫోన్ పైన రూ.40 వేల భారీ డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించింది. ఎల్‌జీ ప్రీమియం ఫోన్ అయిన ఎల్‌జీ వింగ్ ఫోన్‌పైన ఈ భారీ డిస్కౌంట్ ఇస్తూ విక్ర‌యానికి పెట్టింది ఫ్లిప్‌కార్ట్‌.

గ‌త సంవ‌త్స‌రం ఎల్‌జీ కంపెనీ ప్రీమియం రేంజ్‌లో వింగ్ అనే మోడ‌ల్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. టీ ఆకార‌ణంలో ఈ ఫోన్‌ను మార్చ‌గ‌ల‌గ‌డం ఈ ఫోన్ స్పెషాలిటీ. అంతేకాదు, ఈ ఫోన్‌కు రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. మిగతా ఫోన్‌ల కంటే భిన్నంగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను ప్రారంభంలో రూ.79,999కి ఎల్‌జీ విక్ర‌యించింది. కొన్ని రోజుల త‌ర్వాత రూ.10 వేలు డిస్కౌంట్ ఇచ్చింది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ ఫోన్ ధ‌ర రూ.69,000గా ఉండేది. అయితే, ఒక్కసారిగా ఏకంగా రూ.40,000 డిస్కౌంట్ ఇచ్చి ఈ ఫోన్‌లు విక్ర‌యించాల‌ని ఎల్‌జీ నిర్ణ‌యించింది. స్మార్ట్‌ఫోన్ బిజినెస్ నుంచి త‌ప్పుకుంటున్నామ‌ని ఎల్‌జీ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అందుకే స్టాక్‌ను క్లీయ‌ర్ చేయాల‌ని భావిస్తున్న ఎల్‌జీ త‌న ఫోన్‌ల‌పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టిస్తోంది. ఇందులో భాగంగానే వింగ్‌పైన 40 వేల డిస్కౌంట్ ఇచ్చింది.

ఎమ్మార్పీపై చూసుకుంటే ఏకంగా రూ.50 వేల డిస్కౌంట్ ల‌భిస్తోంది. కేవ‌లం రూ.29,999కే ఎల్‌జీ వింగ్‌ను ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. అంటే బడ్జెట్ ఫోన్ ధ‌ర‌లోనే ప్రీమియం ఫోన్‌ను సొంతం చేసుకోవ‌చ్చు అన‌మాట‌. అయితే, ఈ ధ‌ర‌లో 8జీబీ ప్ల‌స్ 128 జీబీ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6.8 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 3.9 ఇంచుల రెండో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది.

అరోరా గ్రే, ఇల్యూజ‌న్ స్కై క‌ల‌ర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 765జీ ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. ఇందులో 64 ఎంపీ ప్రైమ‌రీ కెమెరా, 13 ఎంపీ సెకండ‌రీ సెన్సార్‌, 12 ఎంపీ టెర్టియ‌రీ సెన్సీర్ ఉంటుంది. 32 ఎంపీ పాప్ అప్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంటుంది. క్విక్ ఛార్జ్ స‌పోర్ట్‌, వైర్ లెస్ ఛార్జ్ ఆఫ్స‌న్ కూడా ఉన్నాయి.

Related News