logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

ఏ పని చేయకుండా నెలకు రూ. 1.4 లక్షలు పొందే అవకాశం.. ఎలాంటి షరతులు లేవు!

మీరు విన్నది నిజమే. ఎలాంటి పని చేయకుండా కూర్చున్న చోటు నుంచి కదలకుండా నెలకు రూ. 1.4 లక్షలు సంపాదించే అవకాశం పొందొచ్చు. అయితే మన దగ్గర కాదు. యూనివర్సిటీ ఆఫ్ జర్మనీ వారు ఇలాంటి ఓ వినూత్న ప్రకటన చేసి ఆకట్టుకుంటున్నారు. జర్మనీలో హాంబర్గ్ దగ్గర ఉన్న యూనివర్శిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఈ వింత ఉద్యోగాన్ని ప్రవేశపెట్టింది.

ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థులు రోజంతా ఎలాంటి పని చేయకుండా ఉండగలిగితే చాలు. అదే వారికి పెద్ద అర్హత. యూనివర్సిటీ లోని ఓ మీడియా అవుట్ లెట్ లో ఈ ఉద్యోగం చేయవలసి ఉంటుంది. అయితే ఇంటర్వ్యూలో వారు అడిగే కొన్ని ప్రశ్నలకు సంతృప్తి పరచగలిగే సమాధానాలు చెప్తే చాలు ఈ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అవి కూడా కఠినతరమైన ప్రశ్నలేమీ కాదు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? ఇలా ఎంత కాలం ఖాళీగా ఉండదలుచుకున్నారు? ఏ పనీ చేయకూడదని మీరు ఎందుకు అనుకున్నారు? అనే తేలికపాటి ప్రశ్నలు అడిగి ఇంటర్వ్యూ ముగిస్తారు.

సెలక్ట్ అయితే నెలకు 1600 యూరోలు జీతంగా ఇస్తారు. అంటే మన కరెన్సీలో రూ. 1.4 లక్షలు అన్నమాట. అసలు విషయం ఏమిటంటే.. ఏ పనీ చేయని వారు ఎలా ఆలోచిస్తారు? వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? తదితర విషయాలపై యూనివర్సిటీ వారు ఓ రీసెర్చ్ ను కండక్ట్ చేస్తున్నారు. అందుకోసం ఈ ఉద్యోగాలను ఇస్తున్నారు. దీనిపై ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

Related News