logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

గ్యాస్ సిలిండర్ వినియోగించే వారు ఈ తప్పులు చేయొద్దు!

ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ ను ఉపయోగించని ఇళ్లు కనిపించడం లేదు. పట్టణాల నుంచీ పల్లెటూర్ల దాకా గ్యాస్ సిలిండర్ వినియోగం భారీగా పెరిగిపోయింది. సిలిండర్ ను ఉపయోగిస్తున్నవారు దీనిపై కనీస అవగాహన ఏర్పరుచుకోవాలి. లేదంటే ప్రమాదాల భారిన పడే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కడ చూసినా సిలిండర్ పేలుళ్లకు సంబందించిన వార్తలే వినిపిస్తాయి. కాబట్టి మామూలు కాలాల్లో కన్నా వేసవి కాలంలో గ్యాస్ సిలిండర్ ఉపయోగించేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా గ్యాస్ సిలిండర్ పై ఓ కన్నేసి ఉంచడం మర్చిపోవద్దు.

సాధారణంగా సిలిండర్ లైఫ్ టైం దాదాపు 10 ఏళ్ళు మాత్రమే. కానీ కొన్ని కంపెనీల నిర్లక్ష్యం వల్ల వాటిని పక్కన పెట్టకుండా రీ ఫిల్లింగ్ చేసి అమ్ముతుంటారు. అందుకే డీలర్ల నుంచి మాత్రమే సిలిండర్లను కొనాలి. వాటిపైన ఉండే డ్యూ డేట్ ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఉదాహరణలు మీ సిలిండర్ పై ఏ-21 అని రాసి ఉంటె దాని కాల పరిమితి జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం. అలాగే బీ-21 అని ఉంటె ఏప్రిల్ నుంచి జూన్ వరకు అని అర్థం. ఇందులో 21 అంటే అనే సంఖ్య ప్రస్తుత సంవత్సరాన్ని సూచిస్తుంది. ఈ గడువు దాటితే ఆ సిలిండర్లను ఉపయోగించకపోవడమే మంచిది.

సిలిండర్ ను తీసుకున్న వెంటనే సీల్ కరెక్టుగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సీల్ తీసేటప్పుడు రింగ్ కట్ అయినా, గ్యాస్ వాసన వస్తున్న దానికి వెంటనే తిరిగి ఇచ్చేయాలి. రెగ్యులేటర్, బర్నర్ లను ఎప్పటికపుడు చెక్ చేస్తుండాలి. అవసరం లేని సమయాల్లో రెగ్యులేటర్ ను ఆఫ్ చేయాలి. ముఖ్యంగా రాత్రి వేళ కచ్చితంగా రెగ్యులేటర్ ఆఫ్ చేసి ఉంచాలి. సిలిండర్ ఉన్న గది తలుపులు మొత్తంగా ప్యాక్ చేసి ఉంచకూడదు. గాలి బయటకు వెళ్లేంత ఖాలీ ఉండాలి.

గ్యాస్ స్టవ్ ఎప్పుడు సిలిండర్ కన్నా ఎక్కువ ఎత్తులో ఉండాలి. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైనట్టుగా మీరు గుర్తిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగని తొందరపడి ఇంట్లోని లైట్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆర్పడం, వెలిగించడం లాంటివి చేయకూడదు. దాని ద్వారా వచ్చే చిన్న స్పార్క్ వల్ల కూడా పేలుడు సంభవిస్తుంది. తలుపులు, కిటీకీలు తెరచి గ్యాస్ ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్రిడ్జిలను కిచెన్ లో ఉంచకూడదు. అందులో ఉండే ఆటోమేటిక్ సిస్టం వల్ల గ్యాస్ లీకైనప్పుడు వెంటనే పేలుడు సంభవిస్తుంది.

Related News