logo

  BREAKING NEWS

‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |  

హ‌మ్మ‌య్య‌.. అదుపులోకి వ‌చ్చిన విష‌వాయువు

విశాఖ‌ప‌ట్నంలోని ఎల్జీ పాలిమ‌ర్స్‌లో గ్యాస్ లీకేజ్ అదుపులోకి వ‌చ్చింది. ముంబై, పూణె, నాగ్‌పూర్ నుంచి వ‌చ్చిన తొమ్మిది మంది నిపుణుల బృందం గ్యాస్ లీకేజ్‌ని అరిక‌ట్ట‌డానికి శ్ర‌మిస్తోంది. గుజ‌రాత్ నుంచి తీసుకువ‌చ్చిన ప్ర‌త్యేక ర‌సాయ‌నాల ద్వారా విష‌వాయువు ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రికొన్ని గంట‌ల్లో విష‌వాయువు ప్ర‌భావం పూర్తిగా త‌గ్గిపోతుంద‌ని అధికారులు భావిస్తున్నారు. కాగా, విష‌వాయువు ప్ర‌భావంతో మ‌రొకరు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 12కు చేరింది. కాగా, మ‌ళ్లీ గ్యాస్ లీక‌వుతోంది అంటూ వ‌స్తున్న వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని అధికారులు సూచిస్తున్నారు. గ్యాస్ లీకేజ్ ప్ర‌భావం రెండు కిలోమీట‌ర్లే ఉండుద‌ని, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగానే చుట్టు ప‌క్క‌ల గ్రామాల్లో ప్ర‌జ‌ల‌ను కూడా త‌ర‌లించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు.

Related News