ప్రతి ఇంట్లోని వంటగదిలో ఉండే వెలుల్లి ఔషధ గుణాల గురించి అందరీకి తెలిసిందే. అయితే రాజస్థాన్ లోని కృషి విజ్ఞాన కేంద్రం మహిళలు ఈ వంటింటి ఔషధంతో ఓ వినోత్న ఆలోచన చేశారు. వెల్లుల్లికి మాత్రల రూపంలో తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఆన్ లైన్ లో మాత్రమే లభించే ఈ వెల్లుల్లి మాత్రలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఎన్నో అనారోగ్య సమస్యలకు వెల్లుల్లి మాత్రలు అద్భుతంగా పని చేస్తుండటంతో వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కృషి విజ్ఞాన్ కేంద్రంలో సేవలందించే వైద్యురాలు మమతా తివారి మాట్లాడుతూ.. వెల్లుల్లి ద్వారా కీళ్ల నొప్పులు, బ్లడ్ కొలెస్ట్రాల్ లాంటి జబ్బులను నిరోధించవచ్చన్నారు. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుందన్నారు.
ఈ వెల్లుల్లి మాత్రలను ఎండబెట్టి పొడి చేసి వాటితో మాత్రలు తయారు చేస్తున్నారు ఈ కేంద్రంలోని మహిళలు. అయితే ఈ మాత్రలో వెల్లుల్లిలో ఉండే ఘాట్ వాసనలను లేకుండా చేసేందుకు జంతువుల పదార్థం నుంచి సేకరించిన యానిమల్ జెలటిన్ అనే ప్రోటీన్, బియ్యం పొట్టును వినియోగిస్తున్నట్టుగా తెలిపారు.