తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమైంది. 105 రోజుల పాటు సందడి చేయడానికి 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. హోస్ట్ అక్కినేని నాగార్జున తన స్టైల్లో అందరికీ వెల్కం చెప్పి ఒక్కక్కరినీ హౌజ్‌లోకి పంపించాడు. ఒక్క రోజుకే తెలుగునాట బిగ్ బాస్ హవా మొదలైంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో బిగ్ బాస్‌కు సంబంధించిన విషయాలే చర్చ జరుగుతున్నాయి. అప్పుడే ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరనే దానిపైన కూడా ఎవరి అంచనాలు వారు వేస్తున్నారు.
ప్రజల మూడ్ ఎలా ఉందో కనుక్కునేందుకు సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ఫార్మ్. లైకులు, షేర్లు, కామెంట్ల రూపంలో నెటిజన్లు వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఇప్పుడు బిగ్ బాస్‌కు సంబంధించి 16 మంది కంటెస్టెంట్లలో ఎవరికి ఎక్కువ మద్దతు ఉందనేది ఒక్కసారి సోషల్ మీడియాలో చూస్తే విజేత ఎవరు కావచ్చో ఒక అంచనాకు రావచ్చు. ఇలా చూసినప్పుడు గంగవ్వకే బిగ్ బాస్ టైటిల్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎలాగంటే.. సోషల్ మీడియాలో గంగవ్వ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. గంగవ్వకే తమ ఓటు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ చూడని వారు కూడా గంగవ్వ కోసం ఓటు మాత్రం వేస్తామని చెబుతున్నారు. 16 మంది కంటెస్టెంట్లలో ఎవరికి ఎక్కువ మద్దతు ఉందనేది ఒకసారి స్టార్ మా ఛానల్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజీలు చూస్తే మనకు ఇట్టే అర్థమవుతుంది. స్టార్ మా ఫేస్బుక్లో బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న వారి ఫోటోలు ఒక్కక్కటిగా పోస్ట్ చేశారు.
ఈ ఫోటోలకు వచ్చిన లైకుల ఆధారంగా ఏ కంటెస్టెంట్‌కు ఎక్కువ మద్దతు ఉందో, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా చూసినప్పుడు గంగవ్వకు విపరీతమైన మద్దతు ఉంది. గంగవ్వ దరిదాపుల్లో కూడా మరో కంటెస్టెంట్ ఎవరూ లేరంటే గంగవ్వకు ఉన్న సపోర్ట్ అర్థం చేసుకోవచ్చు. స్టార్ మా ఫేస్బుక్ పేజ్‌లో 12 గంటల్లో మోనాల్ గజ్జర్‌కు 6 వేల లైకులు, సూర్యకిరణ్‌కు 1400 లైకులు, లాస్య, అభిజీత్, కరాటె కళ్యాణి, నోయెల్‌కు 2800 లైకులు, సుజాత, అరియానా గ్లోరీకి 1600 లైకులు వచ్చాయి.
దేత్తడి హారిక, మహబూబ్ దిల్సేకు 3400 లైకులు, దేవి నాగవల్లికి 2900, సోహెల్‌కు 1300, అమ్మ రాజశేఖర్‌కు 1300 లైకులు వచ్చాయి. దివికి 1100, అఖిల్‌కు 1400 లైకులు వచ్చాయి. ఈ 15 మందిలో ఏ ఒక్కరికీ 6 వేలకు మించి లైక్స్ రాలేదు. కానీ, గంగవ్వకు మాత్రం ఏకంగా 20 వేల లైక్స్ వచ్చాయి. అంటే, ఆమెకు ప్రజల్లో ఎంత మద్దతు ఉందో అంచనా వేయవచ్చు.
కేవలం స్టార్ మా ఫేస్బుక్ పేజ్‌లోనే కాదు అన్ని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అప్డేట్స్ పోస్ట్ చేసిన అన్ని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లోనూ గంగవ్వకే ఎక్కువ మద్దతు కనిపిస్తోంది. ఇతర కంటెస్టెంట్లకు గంగవ్వకు ఉన్న మద్దతులో సగం కూడా కనిపించడం లేదు. ఇక, మరో విషయం ఏంటంటే అప్పుడే గంగవ్వ ఆర్మీ కూడా మొదలైంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే ఇప్పటికిప్పుడు చెప్పాలంటే గంగవ్వ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ 105 రోజుల్లో ఎవరు బాగా ఆడతారనే దానిపై కూడా రిజల్ట్‌లో తేడా రావచ్చు.