నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజెక్టులకు సంబందించిన డిపిఆర్ లను వెంటనే సమర్పించాలంటూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలుగు రాష్ట్రాల సీఎం లకు లేఖ రాసారు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలు అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇరు రాష్ట్రాల ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ ఇరు రాష్ట్రాలు 19 ప్రాజెక్టులకు సంబందించిన డిపిఆర్ లను పంపించాలని ఏపీని, 15 ప్రాజెక్టుల డిపిఆర్ లను పంపించాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. ప్రాజెక్టుల డిపిఆర్ లు ఆమోదం పంచేవరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో కేంద్రం స్పష్టం చేసింది.
కొంతకాలంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి కృష్ణా జలాల మధ్య నీటి వివాదం ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదం పై స్పందించిన కేంద్ర జల వనరుల శాఖ ఏపీ తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టులపై అనుమతులు తప్పనిసరి చేసింది. ప్రాజెక్టులకు సంబందించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ను సమర్పించాలంటూ గతంలోనే కేంద్రం ఆదేశించింది. కాగా తాజాగా దీనిపై మరోసారి తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాశారు.