logo

  BREAKING NEWS

పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |  

డాన్స్ స్కూల్ కు వచ్చే యువతులకు వేధింపులు.. యువకుడి అరెస్ట్

డాన్స్ స్కూల్ కు వచ్చిన యువతులను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి టీఎన్జీవో కాలానికి చెందిన చిరంజీవి అనే వ్యక్తి జుంబా డాన్స్ స్కూల్ నడుపుతున్నాడు.

అక్కడకు వచ్చే యువతులకు డాన్స్ స్కూల్ లో లాభాలు బాగా వస్తాయని పెట్టుబడులు పెట్టామని కోరాడు. అతని మాటలు నమ్మిన ఇద్దరు యువతులు అతనికి డబ్బులు ఇచ్చారు. ఇలా అదే కాలానికి చెందిన యువతి వద్ద రూ. 9 లక్షలు, హైదర్షా కోట్ కు చెడిన యువతి వద్ద రూ. 6 లక్షలు కాజేసాడు. డాన్స్ స్కూల్ విషయమై అడగగా రేపు మాపు అంటూ వచ్చాడు.

చివరకు మోసపోయామని తెలుసుకుని నిందితుడిని నిలదీయగా డబ్బులు అడిగినందుకు వారిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ విషయమై బాధిత యువతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 4న అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసారు.

Related News