logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

తరుముకొస్తున్న మరో ప్రాణాంతక వైరస్.. ఇది కూడా చైనాదే!

కరోనా వైరస్ తో ఇప్పటికే ప్రపంచ దేశాలు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు దశాబ్దాలుగా శ్రమించి సాధించుకున్న అభివృద్దని ఈ మహమ్మారి కాలరాసింది. కోటికి పైగా కరోనా కేసులతో ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే మరో పిడుగు లాంటి వార్త మోసుకొచ్చింది చైనా.

కరోనాను మించిన ప్రాణాంతక వైరస్ ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ‘జీ4 వైరస్’ గా నామకరణం చేసారు. 2009లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన హెచ్ 1, హెచ్ 2, జాతికి చెందినదిగా దీనిని గుర్తించారు. మనుషులకు సోకడానికి అవసరమయ్యే అన్ని లక్షణాలు ఈ వైరస్ లో ఉన్నాయని చైనాకు చెందిన వివిధ యూనివర్సిటీల పరిశోధకులు తేల్చారు. అంతే కాదు చైనా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం (సీడీసీ) శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

అయితే ఈ విషయం ఆషామాషీగా తేల్చింది కాదు. గత ఏడేళ్లుగా చైనా ప్రావిన్సులోని పది నగరాల్లో జంతు వధ శాలలు, పశువు వైద్య శాలల్లో నుంచి దాదాపు 30 వేల పందుల నుంచి నమూనాలను సేకరించారు. వీటిపై పరిశోధనలు జరపగా భయానక విషయాలు వెలుగుచూసాయి. ఈ నమూనాల్లో మొత్తలు 179 రకాల స్వైన్ ఫ్లూ వైరస్ లను గుర్తించారు. అందులో ఒకటి జీ4 వైరస్.

వీటిని ముంగీస జాతికి చెందిన ఫెర్రేట్ అనే జంతువులపై ప్రయోగించారు. వైరస్ సోకినప్పుడు మనుషులు కనబరిచే లక్షణాలే ఈ ఫెర్రేట్ జాతి జంతువులు కూడా కనబరుస్తాయి. అయితే కొత్తగా కనుగొన్న అన్ని వైరస్ ల కన్నా జీ 4 వైరస్ ఈ జంతువులపై ప్రమాదకర లక్షణాలను చూపిందని వెల్లడించారు. అంతేకాదు మానవ కణాల్లో వేగంగా వృద్ధి చెంది మరింత శక్తివంతంగా తయారవుతుందని కనుగొన్నారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే పందులకు చెందిన పరిశ్రమల్లో పనిచేసున్న పది మందిలో ఒకరు ఇప్పటికే ఈ వైరస్ బారిన పడ్డట్టుగా గుర్తించారు. వారి శరీరంలోని యాంటీ బాడీల పై పరీక్షలు జరిపి ఈ విషయాన్ని తేల్చారు. కరోనా వైరస్ లాగానే ఇది కూడా ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుందా అనే విషయంపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికే కరోనాతో వ్యక్తుల రోగనిరోధక శక్తి క్షీణించింది. ఈ సమయంలో గనుక జీ4 వైరస్ విజృంభిస్తే ఆపడం పెను సవాలుగా మారుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Related News