logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మ‌న దేశంలో బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్ వంటి రాష్ట్రాల్లో బ‌ర్డ్‌ఫ్లూ వేగంగా విస్త‌రిస్తోంది. బ‌ర్డ్‌ఫ్లూ వైర‌స్ బారిన ప‌డి వేల సంఖ్య‌లో కోళ్లు, ప‌క్షులు మ‌ర‌ణిస్తున్నాయి. ముఖ్యంగా పౌల్ట్రీ ఫామ్‌ల‌లోని కోళ్లు పెద్ద ఎత్తున మృత్యువాత ప‌డుతున్నాయి. బ‌ర్డ్‌ఫ్లూ వైర‌స్ ప‌క్షుల నుంచి మ‌నుషుల‌కు కూడా సోకే ప్ర‌మాదం ఉంది. ప్ర‌త్యేకించి కోళ్ల నుంచి మ‌నుషుల‌కు సోక‌వ‌చ్చు.

కాబ‌ట్టి, చికెన్‌, గుడ్లు అంటే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. మ‌రోవైపు చికెన్‌, గుడ్లు తిన్నా కూడా మ‌నుషుల‌కు బ‌ర్డ్‌ఫ్లూ రాద‌నే మ‌రో వాద‌న కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో చికెన్‌, కోడిగుడ్లు ఎలా తిన‌వ‌చ్చు, ఎలా తిన‌కూడ‌దు అనే విష‌యాల‌పై ఫుడ్ సేఫ్టీ ఆండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొన్ని సూచ‌న‌లు చేసింది. చికెన్‌, గుడ్లు తినేట‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను వివ‌రించింది.

స‌గం ఉడికిన కోడిగుడ్లు, చికెన్ తిన‌డం హానిక‌ర‌మ‌ని ఈ సంస్థ స్ప‌ష్టం చేసింది. హాఫ్ బాయిల్డ్ వంటి వాటికి దూరంగా ఉండాల‌ని సూచించింది. పూర్తిగా ఉడికించిన చికెన్‌, కోడిగుడ్ల‌ను మాత్ర‌మే తినాలి. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా స్ప‌ష్టం చేసింది. పూర్తిగా వండిన కోడిగుడ్లు, చికెన్ తిన‌డం వ‌ల్ల అందులో ఉండే వైర‌స్‌, బ్యాక్టీరియా న‌శిస్తుంది. వీటి నుంచి మ‌నుషుల‌కు ఎటువంటి వైర‌స్‌, వ్యాధులు సోకిన దాఖ‌లాలు లేవు.

అయితే, చికెన్ వండే ముందు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని శుభ్రంగా క‌డ‌గాల‌ని ఎఫ్ఎస్ఎస్ఏఐ చెబుతోంది. బ‌ర్డ్‌ఫ్లూకు కార‌ణ‌మ‌య్యే ఏవియ‌న్ ఇన్‌ఫ్లుయెంజా అనే వైర‌స్ ప‌క్షులు, కోళ్ల శ్వాస‌కోశ‌, జీర్ణాశ‌యాల్లో మాత్ర‌మే ఉంటుంది కానీ మాంసంలో ఉండ‌దు. అయితే, హెచ్5ఎన్1 స్ట్రెయిన్ మాత్రం మాంసంలోనూ ఉండే ప్ర‌మాదం ఉంది. ఇప్పుడు హెచ్5ఎన్1 స్ట్రెయిన్‌తో బ‌ర్డ్‌ఫ్లూ విస్త‌రిస్తోంద‌నే వార్త‌లు వ‌స్తున్నందున కొంత జాగ్ర‌త్త‌గా ఉండ‌టం, పూర్తిగా ఉడికించిన చికెన్‌, గుడ్లు తిన‌డ‌మే సుర‌క్షితం.

వైర‌స్ విస్త‌రిస్తున్నందున పౌల్ట్రీ రంగంలో ప‌ని చేసే వారు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. కోళ్ల ఫామ్‌ల‌లో ప‌ని చేసే వారు, చికెన్ విక్ర‌య‌దారులు చేతికి గ్లౌజులు, మొఖానికి మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలి. చ‌నిపోయిన కోళ్ల‌ను నేరుగా తాక‌కూడ‌దు. సాధ‌ర‌ణ ప్ర‌జ‌లు కూడా ఎక్క‌డైనా చ‌నిపోయిన ప‌క్షులు ఉంటే చేతితో నేరుగా తాక‌కూడ‌దు. త‌ప్ప‌కుండా గ్లౌజులు, మాస్క్ పెట్టుకోవాలి.

Related News