logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

మొబైల్ ఫోన్ యూజర్లకు శుభవార్త! ఈ రీఛార్జ్ ప్లాన్ తో ఫ్రీ హెల్త్ ఇన్స్యూరెన్స్, రోజుకి రూ. 2000 వేలు!

ప్రముఖం టెలికం సంస్థ వోడాఫోన్ ఐడియా (vi) తమ కస్టమర్లకు శుభవార్త వినిపించింది. మీ ఫోన్ ను నెల నెలా రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మొబైల్ డేటా, టాక్ టైంతో పాటుగా అద్భుతమైన బెనిఫిట్లను పొందవచ్చు. అంతేకాకుండా ఉచిత హెల్త్ ఇన్స్యూరెన్స్ సేవలు కూడా అదనంగా పొందవచ్చు. ఇటీవల వోడాఫోన్ ఆదిత్య బిర్లా కంపెనీతో టై అప్ అయిన విషయం తెలిసిందే.

కాగా వోడాఫోన్ ఐడియా కస్టమర్లు కొత్త ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే వారికి ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ను అందజేస్తుంది. అందుకోసం ఆదిత్య బిర్లాతో ఒప్పందం చేసుకుంది. రూ. 51, రూ. 301 అనే రెండు రీచార్జ్ ప్లాన్స్ తో రీచార్జి చేసుకోవడం ద్వారా హెల్త్ ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. అంటే ఎవరైనా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆసుపత్రిలో చేరితే వారికి రోజుకి రూ. 1000 రూపాయలు లభిస్తాయి. ఈ విధంగా పది రోజుల పాటు మాత్రమే ఇస్తారు.

అలాగే ఐసీయూలో చేరి చికిత్స తీసుకునే వారికి అదనంగా మరో వెయ్యి రూపాయలు అందిస్తారు. అంటే రోజుకి రూ. 2000 రూపాయలు లభిస్తాయి. ఈ ఇన్సూరెన్స్ లో కరోనా వైరస్ సోకిన వారితో పాటుగా ఇతర అనారోగ్యాలకు కూడా వర్తిస్తుంది. ఇక ఈ ఇన్సూరెన్స్ పాలసీ 18 నుంచి 55 ఏళ్ల లోపు వయసు వారికి లభిస్తుంది.

ఇక ఈ రీఛార్జ్ ప్లాన్ విషయానికొస్తే.. రూ. 301 ప్లాన్ తో రీచార్జ్ చేసుకునే వారికీ రోజుకి 1. 5 జీబీ డేటా లభిస్తుంది. ఉచితంగా ఉం లిమిటెడ్ కాల్స్ ను కూడా పొందవచ్చు. అయితే ఇదొక ప్రీపెయిడ్ ప్లాన్. దీని వాలిడిటీ 28 రోజులు. 2 జీబీ అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక రూ. 51 ప్లాన్ అనేది యాడ్ ఆన్ ప్లాన్. మీరు ప్రస్తుతం తీసుకున్న ప్లాన్ తో పాటు దీనిని రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. దీని ద్వారా 500 ఉచిత ఎస్ఎంఎస్ లతో పాటుగా ఫ్రీ ఇన్స్యూరెన్స్ బెనిఫిట్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు.

 

Related News