logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కరోనాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. తెలంగాణలో కరోనా వైరస్ సోకిన బాధితులకు సంబంధించి ఇటీవల కొన్ని వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స విషయంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ కొంత మంది వీడియోలో రికార్డు చేసి సన్నిహితులకు పంపగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా మరో కరోనా బాధితుడు తనకు ఊపిరి ఆడటం లేదంటూ ఏకంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు నేరుగా ఫోన్ చేసాడు. ఈ తరుణంలో రాష్ట్రంలో కరోనా టెస్టులు, చికిత్సల విషయంలో ప్రభుత్వం మరింత దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లోనూ క‌రోనా టెస్ట్‌లు, క‌రోనా ట్రీట్‌మెంట్ ఉచితంగా అందించాల‌ని నిర్ణ‌యిం తీసుకుంది.

ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో ఉచిత కరోనా చికిత్సలు, కరోనా పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకోసం మొదటి విడతగా మూడు ప్రైవేటు కాలేజీలను ఎంపిక చేసింది ప్రభుత్వం. మల్లారెడ్డి మెడిక‌ల్ కాలేజ్‌, మమతా మెడిక‌ల్ కాలేజ్‌, కామినేని మెడికల్ కాలేజీల్లో మొద‌ట కరోనా టెస్ట్‌లు, క‌రోనా చికిత్సలు ఉచితంగా అందించ‌నున్నారు. తర్వాత మరిన్ని కాలేజీలకు ఈ సేవలను విస్తరించనున్నారు. ఇందుకు సంబందించిన మరిన్ని వివరాలను ప్రభుత్వం తెలియజేయనుంది.

Related News