logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సౌకర్యాల లేమి, ఇసిఎంఆర్ మార్గదర్శకాల కారణంగా కేవలం తీవ్రమైన కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో అన్ని వసతులు ఉండి ఐసోలేషన్ పాటించే అవకాశం ఉన్నవారు ఇంటి వద్దనే క్వారెంటైన్ చేసి ఐసోలేషన్ ఉండాలని సూచిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు 10 వేలకు పైగా ఉండగా అందులో ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 6 వేల మంది ఉన్నారు. కాగా వీరి కోసం గురువారం వైద్య ఆరోగ్య శాఖ కరోనా కాల్ సెంటర్ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంటి వద్ద ఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగుల కోసం ఉచిత కరోనా కిట్లను అందించనుంది ప్రభుత్వం.

ఈ కిట్ లో 17 రోజుల పాటు అవసరమయ్యే మందులను పంపిణీ చేయనుంది. మాస్కులు, శానిటైజర్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసెటమాల్, యాంటి బయాటిక్స్, విటమిన్ టాబ్లెట్లు, ఎసిడిటీ మాత్రలతో పాటుగా కరోనా పేషంట్లు ఇంటి వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపే ఓ పుస్తకం కూడా ఉంటుంది. వీటిని ఏ విధంగా ఉపయోగించాలో కూడా వారే సూచిస్తారు. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో ఉచిత కరోనా కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Related News