భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. జాతీయ కమిటీలో నలుగురు తెలుగు వారికి అవకాశం దక్కింది. తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌ను ఇద్దరు జాతీయ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. తెలంగాణ నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి కట్టబెట్టారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు లక్ష్మణ్‌కు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవి దక్కింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మరో నేత సత్య కుమార్‌ను బీజేపీ జాతీయ కార్యదర్శిఆ నియమించారు. అయితే, ఇంతకాలం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగిన రాంమాధవ్, మురళీధర్‌రావుకు మాత్రం ఈసారి జాతీయ కమిటీలో చోటు దక్కలేదు. ఇదిలా ఉండగా బెంగళూరుకు చెందిన బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్యకు బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి దక్కింది.