logo

  BREAKING NEWS

జ‌గ‌న్ షాకింగ్ నిర్ణ‌యం.. ఇద్ద‌రు తెలంగాణ వాళ్ల‌కు రాజ్య‌స‌భ సీటు  |   ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |  

దేశవ్యాప్తంగా రైతుల ‘చక్కా జామ్’.. ఢిల్లీలో హై అలెర్ట్!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఎంతటి ఉద్రిక్తంగా మారిందో తెలిసిన విషయమే. తాజాగా రైతు సంఘాలు దేశవ్యాప్తంగా చక్కా జామ్ కు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జాతీయ రహదారులన్నిటినీ దిగ్బందించనున్నారు. దీనిపై రైతు సంఘాలు మాట్లాడుతూ తాము చేపట్టనున్న ఈ ఆందోళనలు శాంతియుతంగానే జరుగుతాయన్నారు.

ఇటీవల చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ తర్వాత అతి పెద్ద నిరసనగా దీనికి పేర్కొంటున్నారు. కాగా ఈ ఈ నిరసనల్లో అరాచక శక్తులు పాలోనే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసారు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో 50 వేల మంది పోలీసులు, పారా మిలటరీ వంటి ప్రత్యేక బలగాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితులనైనా తిప్పికొట్టేందుకు వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు.

రైతులు నిరసన చేస్తున్న ప్రాంతాలన్నింటినీ డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. అంబులెన్సులు, స్కూలు బస్సులతో పాటుగా అత్యవసర సేవలకు మినహాయింపునిస్తున్నట్టుగా రైతు సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీలో మెట్రో స్టేషన్లను మూసివేసిన పోలీసులు అక్కడ నిఘా పెంచారు. కాగా రైతుల దీక్షకు మద్దతుగా దేశంలోని పలు చోట్ల రాస్తారోకోలు ప్రజలు రాస్తారోకోలు నిర్వహించనున్నారు.

 

 

Related News