logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

‘2011 ప్రపంచ కప్ ను భారత్ కు అమ్ముకున్నాం’

2011 ప్రపంచ కప్ ను భారత్ కు అమ్ముకున్నామంటూ శ్రీలంక మాజీ క్రీడా శాఖా మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. 2010 నుంచి 2015 వరకు మహీందానంద అలుత్గామాగే క్రీడా శాఖా మంత్రిగా వ్యవహరించారు. అయితే అప్పటి ప్రపంచ కప్ ను తమ దేశం భారత్ కు అమ్ముకుందన్నారు. అందులో భాగంగానే ఫైనల్స్ లో శ్రీలంక ఓటమిపాలయ్యిందన్నారు.

ప్రస్తుతం శ్రీలంక ఎంపీగా ఉన్న మహీందానంద అలుత్గామాగే ఇటీవల ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా సంచలన ఆరోపణలు చేసారు. ప్రపంచ కప్ ఫైనల్స్ లో శ్రీలంక గెలిచేది కానీ భారత్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్నారు. అందుకు జట్టులోని కొంతమంది సహకరించానన్నారు. అప్పుడు తమ దేశం మేలు కోసమే ఈ విషయం బయటపెట్టలేదని వివరణ ఇచ్చారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

కాగా మూడేళ్ళ క్రితం శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా 2011 ప్రపంచ కప్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగించని ఆరోపించారు. కేవలం ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక మ్యాచ్ ఓడిపోవడం తనను విస్మయానికి గురిచేసిందని ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసారు. కాగా ఈ ఆరోపణలపై స్పందించిన ఆనాటి వరల్డ్ కప్ భారత జట్టు సభ్యులు గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా ఈ ఆరోపణలను ఖండించారు. రణతుంగ తన ఆరోపణలకు అధరాలు చూపాలని డిమాండ్ చేసారు. తాజాగా ఈ విషయంపై మహీందానంద చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.

Related News