తెలంగాణలో రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ సీట్లకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. హైదరాబాద్- రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు పేరును ఖరారు చేసారు.
పీవీ కూతురైన సురభి వాణి దేవి మాదాపూర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల వ్యవస్థాపకురాలు. దీంతో పట్టభద్ర ఎనికల అభ్యర్థిగా వాణీదేవీనే కరెక్టని కేసీఆర్ భావించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఖరారు ఖరారు చేసారు. కాంగ్రెస్ నేత అయిన పీవీ నరసింహారావు జయంతి వేడుకలను సీఎం కేసీఆర్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎల్లుండితో నామినేషన్లు గడువు ముగియనుంది. మార్చి 14 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.