logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

బ్రేకింగ్: కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత..!

కరోనాతో బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(60) కన్నుమూశారు. గత నెల స్నేహితుడి ద్వారా ఆయనకు కరోనా సోకినా విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత ఆసుపత్రి లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మాణిక్యాలరావు మృతితో బీజేపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. 1989లో బీజేపీలో చేరిన మాణిక్యాలరావు చివరి వరకు అదే పార్టీలో కొనసాగారు.

2014 లో తాడేపల్లి గూడెం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. టీడీపీ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పని చేసారు. ఫోటో గ్రాఫర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవక్ గా చురుకుగా పని చేసారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి పదవిని చేపట్టారు. మాణిక్యాలరావు మరణం పార్టీకి తీరని లోటని బీజేపీ నేతలు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మాణిక్యాలరావుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించనున్నారు.

 

Related News