logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

అరికాళ్లలో మంటలు ఎందుకు వస్తాయి.. ఇలా తగ్గించుకోండి!

అరికాళ్లలో మంటలు రావడం అనేది చాలా మందిని వేధించే సమస్య. ఉన్నట్టుండి పాదాల్లో వేడి సెగలు రావడం, మంట, తిమ్మిర్లు అనిపించడం జరుగుతుంటుంది. దీనినే పరేస్తేషియా లేదా న్యూరోపతి అని పిలుస్తారు. ఎలాంటి గాయాలు, దెబ్బలు తగలేకపోయినా కాళ్లలో సూదులతో గుచ్చుతున్నట్టుగా వచ్చే ఈ మంటలు ఇబ్బంది కలిగిస్తాయి. దీనికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు.

సాధారణంగా నాడీ సంబంధ సమస్యలు ఉన్న వారిలో ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్న వారిలో, మధుమేహంతో బాధపడేవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మధుమేహానికి సంబందించిన మందులు కూడా దీనికి కారణం కావచ్చు. పదాలలో ఇన్ఫెక్షన్ఎ, ఎక్కువ సేపు నిల్చుని పని చేయడం వల్ల నాడీ వవ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా పాదాల్లో నాడుల స్పందనలు మంట కలిగిస్తాయి.

రుమటాయిడ్, ఆర్థరైటిస్, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులు, రోగ నిరోధక శక్తి పొరపాటున మన శరీరంపై వ్యతిరేకంగా పనిచేయడం లాంటివన్నీ కూడా కారణాలుగా చెప్పవచ్చు. అయితే మన దేశంలో విటమిన్ బి12 లోపం వల్ల చాలా మంది ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు.
మన శరీరంలోని నాడుల చుట్టూ ఒక రక్షణ పొర ఏర్పడి ఉంటుంది. శరీరంపై ఏదైనా వైరస్ దాడి చేసినప్పుడు, లేదా పైన చెప్పుకున్న సమస్యలు ఉన్నప్పుడు ఆ రక్షణ పోర దెబ్బతినే అవకాశం ఉంటుంది.

ఈ పొర తొలగినప్పుడు ఇలా మంటలు రావడం జరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు ముందుగా బి12 లోపాన్ని తగ్గించుకోవాలి. అతిగా మద్యం సేవించేవారిలో ఈ విటమిన్ లోపిస్తుంది. అందుకోసం ఈ విటమిన్ ఎక్కువగా లభించే పాలు, మాంసం, గుడ్లు, చికెన్, పాల ఉత్పత్తులు, చేపలు తీసుకుంటే తగ్గిపోతుంది. లేదంటే వైద్యుల సూచనల మేరకు విటమిన్ బి12 ,మాత్రలను కూడా వేసుకోవచ్చు కానీ ఇవి అందరికీ పని చేయకపోవచ్చు.

వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల పాదాల్లో రక్తప్రసరణ బాగా జరిగి ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. వీలైనంత వరకు కాళ్లకు పాదరక్షలు లేకుండా గడ్డి మీద నడవడం చేయండి. వేడి నేతిలో ఉప్పు వేసి కళ్ళను ఉంచితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే విటమిన్ బి3 లోపం ఉంటె వెంటనే అందుకు సంబందించిన ఆహారాన్ని డైట్ లో చేర్చుకోండి. రక్త పీడనం కారణంగా నరాలు తెగిపోయే సమస్య దీని వల్ల నయమవుతుంది.

Related News