logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

ఇవి తింటే మీ రోగనిరోధకశక్తి మటాష్..!

కరోనా కాలంలో రోగ నిరోధకశక్తి పెంచుకోటం అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో అసలు రోగ నిరోధక శక్తిని తగ్గించే అలవాట్లు ఏమిటి? రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎలా పెంపొందించుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది అప్పటికప్పుడు వచ్చేది కాదు. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పెంపొందుతుంది. అది కౌమారం వయసుకు వచ్చిన తర్వాత నుంచి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇక మధ్య వయస్కుల్లో తక్కువగా, వృద్ధుల్లో మరీ తక్కువగా ఉంటుంది. అయితే ఎవరైతే పోషక విలువలతో కూడిన ఆహరం తీసుకుంటారో, తరచుగా వ్యాయామం చేస్తారో అలాంటి వారిలో యుక్తవయస్కులతో సమానంగా రోగనిరోధకశక్తి పని చేస్తుందని నిపుణులు గుర్తించారు.

మనరోజూవారీ అలవాట్లు కొన్ని దీనిని చంపేస్తాయి. నిత్యం మద్యం సేవించేవారిలో కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉండటంతో పాటుగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఎక్కువగా ఉప్పు తినేవారిలో కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అదే విధంగా అధిక రక్తపోటు బారిన పడతారు. ప్రతి రోజూ మోతాదును మించి చక్కెరను తీసుకునేవారిలో ఇమ్మ్యూనిటీ తగ్గిపోతుంది. ఇక కాఫీలు, టీలు ఆరోగ్యానికి కలిగే లాభనష్టాల గురించి ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవు.

కానీ ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు రావచ్చు. ఫలితంగా రోగనిరోధకశక్తి తగ్గుతుంది. జంక్ ఫుడ్ తినేవారిలో, ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేవారిలో రాక్తపోటు, శ్వాస సమస్యలు , జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అప్పుడు రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. ప్రతి రోజు తగినంత నీటిని తాగడం, విటమిన్లు, పోషకాలు, పీచు పదార్ధం ఎక్కువగా ఉండే ఆహారం తినడం ముఖ్యంగా తాజా పండ్లు కూరగాయలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వ్యాయామం, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా వైరస్ లతో పోరాడే తెల్ల రక్తకణాలను శరీరమంతటా విస్తరించేలా చేస్తాయి. అవి కరోనా లాంటి వైరస్ లు శరీరంలోకి ప్రవేశిస్తే పసిగట్టి వెంటనే వాటిని నశింపజేస్తాయి.

Related News