logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బ్రేకింగ్: జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం రూ.10 వేలు నిలిపివేత!

గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారికి జీహెచ్ఎంసీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం వరద సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వరద బాధితులకు రూ. 10 వేల చొప్పున ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు పంపిణీ చేసింది. కాగా తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.

హైదరాబాద్ పరిధిలో అందిస్తున్న వరద సాయం నగదు పంపిణీని నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రక్రియను నిలిపివేయాలని తెలిపింది.

అయితే గ్రేటర్ ఎన్నికల అనంతరం మళ్ళీ దరఖాస్తుల స్వీకరణ, నగదు పంపిణీ కొనసాగించుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపింది. కాగా వరద సాయం కోసం ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు మీసేవ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. కొన్ని చోట్ల తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. పోలీసులు కూడా అదుపుచేయలేనంతగా ప్రజలు క్యూలైన్లలో బారులు తీరారు.

ఇదిలా ఉండగా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ టీఆర్ఎస్ పార్టీ ఈ పేరుతో ఓటర్లను ప్రభావితం చేస్తుందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు కూడా అందడంతో ఎన్నికల కమిషన్ తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది.

Related News